వలస కార్మికులు ఇబ్బందులకు గురికాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహూబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో 35 మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 నగదు అందజేశారు. వీరికి వ్యవసాయ పనులు కల్పించాలని స్థానికులను కోరారు.
వలస కూలీల పిల్లలకు అంగన్వాడీ సరకులు అందించాలని, వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. మంత్రి వెంట కలెక్టర్ వీపీ గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, అధికారులు ఉన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా కాటుకు ఆరుగురు మృతి