ETV Bharat / state

మాజీ జవాన్​ను మోసగించిన రియల్టర్.. - telangana varthalu

రియల్​ ఎస్టేట్​ వ్యాపారికి 20 లక్షలు ఇచ్చి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సైనికుడు కొమ్ము కేశవరావు. 20 ఏళ్లుగా దేశానికి సేవ చేసి వస్తే సమాజంలో తనకు జరిగిన న్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. వ్యాపారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

రియల్​ ఎస్టేట్​ వ్యాపారి చేతిలో మోసపోయాను.. న్యాయం చేయండి!

author img

By

Published : Feb 4, 2021, 5:54 PM IST

సొంతింటి కలను నిజం చేసుకొనేందుకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 20 లక్షలు ఇచ్చి మోసపోయానని... మహబూబాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు కొమ్ము కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 20 ఏళ్లుగా మిలటరీలో పని చేసి... 2018లో రిటైర్డ్ అయినట్లు తెలిపారు. తన రిటైర్మెంట్ అనంతరం గ్రాట్యుటీ, పీఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులతో ఓ ఇంటిని కొనుక్కొనే ఆలోచనతో... మహబూబాబాద్ జిల్లా నాంచారి మడూర్ గ్రామంలో రాయల్ స్మార్ట్ సిటీ వెంచర్స్ ఎండీ మిన్నకంటి శ్రీనివాస్​ను కలిసినట్లు వివరించాడు. తన వెంచర్​లో డబుల్ బెడ్ రూమ్ హౌస్ బుక్ చేసుకుంటే... 100 శాతం క్యాష్ బ్యాక్ వస్తుందని నమ్మబలికినట్లు పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి 10 లక్షలు కడితే... ప్రతి నెల 15 వేల చొప్పున 60 నెలల్లో కట్టిన పూర్తి నగదు తిరిగి ఇస్తామని ఆశ కల్పించారని తెలిపారు.

ఆయన మాటలు నమ్మి తన వద్ద ఉన్న 20 లక్షలు కట్టి... రెండు ఇళ్లను బుక్ చేసుకున్నానన్నారు. మొదటగా 2019లో మొదటి ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇచ్చారని... కొన్ని రోజులకే ఇంటి గోడలు కుంగిపోయాయన్నారు. ఇలా నాసిరకంగా ఇల్లు కడతావా అని ప్రశ్నించగా... తాను ఉంటున్న ఇంటికి విద్యుత్​, నీటి సరఫరా నిలిపివేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తన రెండో ఇంటి నిర్మాణం నిలిపివేసి... తనకు ఇస్తానని చెప్పిన నెలనెలా క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నారు. 20 ఏళ్లుగా దేశానికి సేవ చేసి వస్తే... సమాజంలో తనకు జరిగిన న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. తన మాదిరిగానే అనేక మంది అమాయకులను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మిన్నకంటి శ్రీనివాసరావుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

రియల్​ ఎస్టేట్​ వ్యాపారి చేతిలో మోసపోయాను.. న్యాయం చేయండి!

ఇదీ చదవండి: మహిళలపై వేధింపులు... షీ టీమ్స్​కు ఫిర్యాదులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.