ETV Bharat / state

ఉప్పొంగుతున్న చెరువులు.. ఆకట్టుకుంటున్న మత్తడి సోయగాలు - మహబూబాబాద్​లో మత్తడి సోయగాలు

శనివారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబాబాద్​ జిల్లాలో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి వల్ల పలు మండలాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ponds-in-mahabubabad-district-are-over-flooded-with-rain-water
మహబూబాబాద్​లో ఉప్పొంగుతున్న చెరువులు
author img

By

Published : Sep 27, 2020, 11:54 AM IST

మహబూబాబాద్​ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారులు బురదమయమయ్యాయి. దంతాలపల్లి మండలంలోని పాలేరు, చిన్నగూడూరు వద్ద ఆకేరు, డోర్నకల్​లోని మున్నేరు వాగులు వరద ఉద్ధృతితో పొంగిపొర్లుతున్నాయి.

ponds-in-mahabubabad-district-are-over-flooded-with-rain-water
మహబూబాబాద్​లో ఉప్పొంగుతున్న చెరువులు

చెక్​డ్యామ్​ల వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు అలుగు పారుతున్నాయి. పాలేరు వాగులో వరద ఉద్ధృతి వల్ల దంతాలపల్లి-పెద్ద ముప్పారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లో-లెవల్​ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వాగుల వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న సాగునీటి విద్యుత్​ మోటార్లు నీటిలో మునిగిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.