ETV Bharat / state

విద్యార్థి నిండు ప్రాణాన్ని కాపాడిన డయల్​ 100 - విద్యార్థి నిండు ప్రాణాన్ని కాపాడిన డయల్​ 100

డయల్ 100కి ఫోన్​ చేస్తే నిమిషాల్లో ఘటనా స్థలంలో ఉండి తగిన సహకారం అందిస్తామన్న మాటను పోలీసులు మరోసారి నిలబెట్టుకున్నారు. వెంటనే స్పందించటమే కాకుండా... ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని కాపాడారు. రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ అబ్బాయిని పోలీసులు రక్షించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సంఘటన మహబూబాబాద్​లో జరిగింది.

POLICE SAVED A STUDENT LIFE THROUGH DIAL 100

author img

By

Published : Dec 11, 2019, 9:15 PM IST

మహబూబ్​బాద్​ జిల్లా మరిపెడ మండలం బీచ్​రాజ్​పల్లికి చెందిన గణేష్ అనే విద్యార్థి మరిపెడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనుకబడి పరీక్షల్లో ఉత్తీర్ణున్ని కాలేనేమోనన్న భయంతో... చనిపోతున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అప్రమత్తమైన తండ్రి... వెంటనే 100కి ఫోన్​ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు.

తక్షణమే స్పందించిన మహబూబాబాద్ పోలీసులు విద్యార్థి మొబైల్​ లోకేషన్​ను ఆధారంగా చేసుకుని ఘటనా స్థలికి చేరుకున్నారు. రైల్వేట్రాక్​పై ఆత్మహత్యకు సిద్ధమైన విద్యార్థి గణేష్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చి కౌన్సెలింగ్​ ఇచ్చారు. అనంతరం తండ్రికి అప్పగించారు. సమాచారం అందగానే స్పందించి విద్యార్థిని కాపాడిన సిబ్బందిని డీఎస్పీ నరేష్ కుమార్ అభినందించారు.

విద్యార్థి నిండు ప్రాణాన్ని కాపాడిన డయల్​ 100

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.