ETV Bharat / state

మానుకోటలో సాగు ప్రణాళిక ఖరారు

author img

By

Published : May 4, 2020, 9:44 AM IST

మహబూబాబాద్​ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికను వ్యవసాయశాఖ అధికారులు రూపొందించారు. ఈ వానాకాలంలో 1,62,518 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

మహబూబాబాద్​ జిల్లాలో సాగు ప్రణాళిక ఖరారు

మహబూబాబాద్​ జిల్లాలో ఈ వానాకాలంలో 1,62,518 హెక్టార్లలో పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, అపరాల సాగుతో పాటు మిర్చి, పసుపు పంటలను సాగు చేస్తారని, అందుకు 19,776.58 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వానాకాలంలో 42,497 హెక్టార్లలో పత్తి సాగవుతుందని అంచనా.

ఇందుకు 2,48,300 పత్తి విత్తన సంచులు, 1,43,043 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఛత్రునాయక్‌ తెలిపారు. వరిలో బీపీటీ-5204, కేఎన్‌ఎం-118, ఎంటీయూ-1001, ఎంటీయూ-1010, ఆర్‌ఎన్‌ఆర్‌-15048 రకాలకు సంబంధించి విత్తనాలు 28502.75 క్వింటాళ్లు, ప్రైవేట్‌ మొక్కజొన్న హైబ్రీడ్‌ విత్తనాలు 2785 క్వింటాళ్లు, ఎంజీజీ-295, డబ్ల్యూజీజీ-42 పెసర రకాలు 1653 క్వింటాళ్లు, మినుములు-పీయూ31 రకం 484, కందులు 398, వేరుశనగ 515, నువ్వులు 5, సోయాబీన్‌ 20 క్వింటాళ్లు ఇక పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పిల్లిపిసర 34, జనుము 1710, జీలుగ 6123 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రతిపాదనలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.