మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో జాతీయ పక్షి నెమలి కనువిందు చేసింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీప అటవీ ప్రాంతాల నుంచి నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. చిలుకోడు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి ఓ నెమలి చిలుకోడు గ్రామానికి చెందిన ఉపేందర్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో వచ్చి వాలింది. నేరుగా ఇంట్లోకి వెళ్లి కాసేపు సందడి చేసింది. ఇంట్లోకి వచ్చిన నెమలిని చూసిన స్థానికులు ఆసక్తిగా అది ఏం చేస్తుందో అని చూశారు. కొద్దిసేపటికి నెమలిని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!