భారత దేశంలో గ్రామ ప్రజలు, రైతులు బాగుండాలని ఆలోచించే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని పార్లమెంట్ తెరాసపక్ష నేత నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో .. రైతు వేదిక, పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటికలను ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
పార్టీలకతీతంగా..
తెలంగాణ ఏడేండ్ల పాలనలో గ్రామాల రూపురేఖలు మారాయని తెలిపారు. భారతదేశంలో పల్లె ప్రజలు, రైతులు బాగుండాలని ఆలోచించే సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. పార్లమెంటులో పల్లె ప్రగతి గురించి మాట్లాడుతుంటే పార్టీలకతీతంగా ఎంపీలంతా నా వైపు చూస్తూ చప్పట్లు కొట్టారని తెలిపారు.
కొనియాడారు..
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిలిచిపోయాయని, రైతులకు కావాల్సిన కరెంటు, నీళ్లు ఇచ్చారని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నారన్నారు. గోదావరిని అరకిలోమీటరు పైకెత్తి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు.
మరిచిపోవద్దు..
ప్రజలు కన్న వారిని.. ఉన్న ఊరుని మరిచిపోవద్దని తెలిపారు. గ్రామంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకంగా త్వరలో కల్యాణ మండపాన్ని నిర్మిస్తానని హామీనిచ్చారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన డాక్టర్. దేవులపల్లి కేశవరావును అభినందించారు.
ఇదీ చదవండి: 'కాన్పు కోసం వస్తే గర్భమే రాలేదంటున్నారు..!'