ETV Bharat / state

కరోనాతో ప్రవాస భారతీయుడు మృతి

అమెరికాలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా​ పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామానికి చెందిన బానోత్ ప్రేమ్​లాల్​ తన సోదరుని వివాహం కోసం ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.

NRI Software engineer died with Corona
కొవిడ్​తో ఎన్​ఆర్​ఐ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ మృతి
author img

By

Published : Apr 30, 2021, 9:39 AM IST

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు బానోత్​ ప్రేమ్ లాల్ కరోనాతో మృత్యువాత పడ్డాడు. అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజినీర్​గా పని చేస్తున్న అతను మే 6 న తన సోదరుని వివాహానికి హాజరయ్యేందుకు ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.

తీవ్రమైన జ్వరం రావడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి ఆస్పత్రి వైద్యుని సూచనలతో హైదరాబాద్​కు తీసుకురాగా కోలుకోలేక మృతి చెందాడు. ఇప్పటికే మైలారం గ్రామంలో అతని తల్లితండ్రులకు సైతం కొవిడ్ పాజిటివ్​గా రాగా... మరో 15 మంది బాధితులు ఉన్నారు. మృతునికి భార్య, ఓ కూతురు ఉంది.

ఇదీ చూడండి: ప్రభుత్వాలు, ప్రజల నిర్లక్ష్యమే కరోనా రెండోదశకు కారణం: డా.రామచందర్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.