ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 పురపాలికల్లో మొత్తం 1537 నామపత్రాలు దాఖలయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో మొత్తం 384 నామినేషన్లు రాగా... పరకాల పురపాలికలో 120, నర్సంపేట 162, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 102 మంది అభ్యర్థులు రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించారు.
మహబూబాబాద్ జిల్లాలో మొత్తం 602 నామినేషన్లు దాఖలయ్యాయి. మహబూబాబాద్ పురపాలికలో 261, డోర్నకల్ 120, మరిపెడలో 94, తొర్రూరులో 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో 289 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. జనగామ పురపాలికలో 262 నామినేషన్లు దాఖలయ్యాయి.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ర్యాలీలను 100 మీటర్ల దూరంలోనే నిలిపి వేశారు. పోటీ చేసే అభ్యర్థి తో పాటు... మరో ఇద్దరు వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతించారు.
- ఇవీ చూడండి: రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్