మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం శివారు సీతారాంపురంతండాలో ఇటీవల హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత (Maloth Kavitha) పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు.
బాలిక మృతి పట్ల ఎంపీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. ఆమె వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు.