బుధవారం రాత్రి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి మున్నేరు, పాకాల, వట్టి, ఆకేరు, పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కేసముద్రం నుంచి గుడూరు, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వర్షానికి మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే శంకర్ నాయక్ జలమయమైన గుళ్లకుంట, గోపాలపురం, అనంతారం తదితర కాలనీలలో పర్యటించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.
కొవిడ్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజలందరూ తమ తమ పరిసరాల్లో నీరు చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా పరీక్షల సామర్థ్యం పెంపుపై ఐసీఎంఆర్ సూచనలు