ETV Bharat / state

'సీఎం కేసీఆర్.. కర్షకునికి కష్టం రానీయరు' - farmer platforms in mahabubabad district

దేశంలో ఇప్పటి వరకు అన్నదాతల గురించి తెరాస సర్కార్​ ఆలోచించినంతగా ఏ ప్రభుత్వం యోచన చేయలేదని మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్​ అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

farmer-platforms-in-mahabubabad-district
మహబూబాబాద్​ జిల్లాలో రైతు వేదికలు
author img

By

Published : Jul 18, 2020, 1:53 PM IST

రైతు వేదికలు కర్షకులకు ఎంతగానో ఉపయోగపడతాయని మహబూబాబాద్​ ఎమ్మెల్యే శంకర్​నాయక్ అన్నారు. జిల్లాలోని కంబాలపల్లి, ఆమనగల్లు, జంగిలిగొండ, మల్యాల గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ఎమ్మెల్యే అన్నారు. అన్నం పెట్టే కర్షకుని కళ్లలో నీళ్లు రాకూడదని.. వారి అభివృద్ధి కోసం రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి అనేక పథకాలు చేపట్టారని కొనియాడారు.

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోన్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ తమను తామే రక్షించుకోవాలని ఎమ్మెల్యే శంకర్​నాయక్​ సూచించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.