రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారం, ఎర్రబెల్లి గూడెం గ్రామాలలో మక్కలు, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ నిర్వాహకులు ఇచ్చే టోకెన్ల ద్వారా రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు భూక్యా బాలాజీ, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు