మంత్రి కేటీఆర్ ఆదేశాలనుసారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందించారు. గూడూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన రూ. 3,33,000 చెక్కులను పంపిణీ చేశారు.
అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని, కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.