ఆసరా పింఛన్ల పథకం నిరుపేదలకు వరమని డోర్నకల్ శాసన సభ్యుడు రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. దంతాలపల్లి మండలంలో 3814 మందికి నెలకు రూ.1.3 కోట్ల చొప్పున పింఛన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోన్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఇవీ చూడండి: 'నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం'