మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తెరాస ఆధ్వర్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ముఖ్య అతిథిగా హాజరై.. కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణుల తరఫున కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని.. తెలంగాణకు సేవచేసే భాగ్యం ఆయనకు కలగాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం అందరికి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: పండుగలా "కేటీఆర్" జన్మదిన వేడుకలు