వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, పెద్దముప్పారం, గున్నేపల్లి, ఆగపేట, రామవరం గ్రామాల్లో పర్యటించి పల్లె ప్రగతి పనులను ప్రారంభించారు.
అన్నదాతల లబ్ది కోసమే రైతు వేదికలు నిర్మించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. 57ఏళ్ల వారికి పింఛన్లు, నిరుద్యోగభృతి అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యోగ ఖాళీలను మార్చిలోపు భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దంతాలపల్లి శివారు బొడ్లడ స్టేజీవద్ద ఇళ్లు కోల్పోయిన వారు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. స్థలాలు కొనుగోలు చేసి కట్టుకున్న వాటిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: పొలంలోనే అన్నదాత సత్యాగ్రహ దీక్ష