ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 111 మంది లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం రైతులకు ప్రభుత్వం రాయితీపై కేటాయించిన జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, గిరిజన తండాలకు తారురోడ్డు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రాయితీపై కేటాయించే విత్తనాలను వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: గోదావరి నది పరివాహక జిల్లాల మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష