పారిజాతం, రాజేశ్వర్రావు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలని... పాడి పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు