ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ బ్లాక్​ను సందర్శించిన మంత్రి సత్యవతి​

author img

By

Published : May 14, 2021, 2:04 PM IST

ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో లాక్​డౌన్​ విధించారని.. ప్రజలంతా ఇందుకు సహకరించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్ బ్లాక్​ను సందర్శించి బాధితులను పరామర్శించారు.

minister satyavati visited covid block in mahabubabad
కొవిడ్​​ బ్లాక్​ను సందర్శించిన మంత్రి సత్యవతి

ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ కోరారు. మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కొవిడ్​ బ్లాక్​ను మంత్రి సందర్శించారు. కరోనా బాధితులను పరామర్శించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

కరోనాబాధితులకు సమర్ధవంతంగా సేవలు అందిస్తున్న వారందరికీ సత్యవతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 750 మంది సిబ్బందితో బృందాలు గ్రామాల్లో సర్వే చేస్తున్నాయని.. ప్రాథమిక దశలో ఉన్నవారికి ఇంటి వద్దకే వచ్చి మందులను అందజేస్తున్నట్లు తెలిపారు.

కరోనా రోగులకు సేవలందించే ప్రైవేట్ ఆస్పత్రులకు రెమ్​డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సరఫరాపై ఐఎంఏ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో జిల్లాకు టి డయాగ్నొస్టిక్ సెంటర్​ను మంజూరు చేశారని అన్నారు. దానిని త్వరలో ప్రారంభిస్తామని, కొవిడ్ బ్లాక్​లో మరో 30 పడకలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొవిడ్​కు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా కల్పించారు. ఆస్పత్రి సందర్శనలో కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఆస్పత్రి సూపరింటిండెంట్ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.