సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు గడువులోపు ఆర్టీసీ కార్మిక సోదరులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని... స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. మహబూబాబాద్‌లోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను విపక్షాలు తప్పుదోవపట్టిస్తున్నారయన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకొని లబ్ధి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో 91 కార్పోరేషన్లు ఉండగా... ఒక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యపడదన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగిన తహసీల్దార్ విజయారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సమావేశంలో ఎంపీ మాలోత్ కవితతో పాటు పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర