ETV Bharat / state

డయాగ్నస్టిక్ హబ్ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి సత్యవతి

మహబూబాబాద్​లో డయాగ్నస్టిక్​ హబ్​ సెంటర్​ను మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. 57 రకాల పరీక్షలు ఈ హబ్​లో చేస్తారని, ప్రజలెవరూ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని మంత్రి సత్యవతి తెలిపారు.

minister satyavathi started diagnostic hub center in mahabubabad
డయాగ్నస్టిక్ హబ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సత్యవతి
author img

By

Published : May 17, 2021, 1:35 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరచాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డయాగ్నస్టిక్ హబ్​ సెంటర్​లను మంజూరు చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో 2 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్​ను మంత్రి ప్రారంభించారు.

ఈ పరీక్షా కేంద్రంలో 57 రకాల పరీక్షలను చేయవచ్చన్నారు. గతంలో ఈ పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా... కొవిడ్ రోగుల ఇన్ఫెక్షన్ శాతాన్ని కూడా తెలుసుకోవచ్చని సత్యవతి అన్నారు. త్వరలోనే సిటీ స్కాన్ బ్లాక్​ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఏ ఉద్దేశం కోసం లాక్​డౌన్​ విధించుకున్నామో దాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని... అందరూ సహరించాలని కోరారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆక్సిజన్​, ఔషధాలను ఎప్పటికప్పుడు సమకూరుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​, జిల్లా కలెక్టర్​ గౌతమ్​, జడ్పీ ఛైర్​పర్సన్​ బిందు ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.