మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. మొదటగా డాక్టర్ వెంకట్రాములు టీకా తీసుకున్నారు. ఏడాదిగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వ్యాధి అంతానికి ఈరోజు తొలి అడుగు పడిందని.. ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో 120 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 4,170 మందికి మొదటి రోజు వ్యాక్సినేషన్ చేయనున్నారని మంత్రి వివరించారు.
ధైర్యంగా తీసుకోవచ్చు
కరోనా విపత్కర సమయంలో కృషి చేసిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి మొదటగా వ్యాక్సినేషన్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని.. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మార్చి వరకు మహమ్మారి పూర్తిగా అంతం కావాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ ఓ వరం.. శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం'