మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నుంచి రహదారి పక్కన 100 మొక్కలను నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు.
హరితహారంలో భాగంగా ప్రజలందరూ మొక్కలు నాటాలని మంత్రి కోరారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని గ్రీన్ ల్యాండ్లు, పార్కులు, రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటి... మున్సిపాలిటీలో 4.5 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డిలకు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి: రైతువేదిక నిర్మాణానికి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ