కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు చేశారు. కరోనా కష్టకాలంలో ఆదుకోవాల్సింది పోయి పనికిరాని ప్యాకేజీ ప్రకటించారని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసరాలను మంత్రి అందించారు.
కరోనా ఇప్పట్లో పోయేలా లేదని అందరూ జాగ్రత్తలు పాటిస్తూ జీవించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.
"కేంద్రం ఇచ్చింది ప్యాకేజీ కాదు.. అప్పు. భాజపా ప్రభుత్వం ఇచ్చే షరతులు ఇవి. కేసీఆర్ చేసే నిర్ణయాలు మనకోసం. రైతులు, ప్రజలు బాగుండాలని ఎన్నో త్యాగాలు చేస్తున్నారు."
-ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఇదీ చూడండి: కరోనా రికార్డ్: 24 గంటల్లో 5,611 కేసులు, 140 మరణాలు