తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. విజయాన్ని సీఎం కేసీఆర్కు కానుకగా అందించాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి పాల్గొన్నారు.
2014 నుంచి ఇప్పటివరకు 1,31,001 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అలా చేయకపోతే బరిలో నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
ప్రశ్నించే గొంతులను కాదు.. సమస్యలు పరిష్కరించే వారిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఓటర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కు నమోదుకు నేడు తుదిగడువు