అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ ( మావోయిస్టు ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ కోరారు. గడిచిన ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ఘటనలలో 110 మంది మావోయిస్టులు అమరులయ్యారని... వారిని స్మరించుకుంటూ జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు గ్రామ గ్రామాన కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. ఈ మేరకు జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.
నరేంద్ర మోదీ, అమిత్ షాల పాలన నిరంకుశంగా మారిందని, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ పేరుతో మాయమాటలు చెప్పి పీడిత వర్గాలైన కార్మిక.. కర్షక వర్గాలను అణగ తొక్కుతున్నారని ఆరోపించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపట్టి మరింత నియంతృత్వంగా మారిందని, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని జగన్ విమర్శించారు. 2022 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు