మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని 200 మంది నిరుపేద కుటుంబాలకు ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి ఆధ్వర్యంలో 5 రకాల కూరగాయలను జడ్పీ ఛైర్ పర్సన్ ఆంగోత్ బిందు, తెరాస నాయకులు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. మండలంలో గత 3 రోజులుగా పంపిణీ చేస్తున్నామని జడ్పీ ఛైర్ పర్సన్ బిందు తెలిపారు.
ఈ విపత్కర సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఎంపీటీసీ కుమారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: మానవత్వం చాటుకున్న జడ్పీటీసీ... గర్భిణి వలసకూలీకి సాయం