ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురండి' - మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత

భాజపా నాయకులకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత అన్నారు.

మాలోతు కవిత
author img

By

Published : Aug 26, 2019, 9:58 PM IST

'చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకురండి'

భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలని మహబూబాబాద్​ ఎంపీ మాలోత్​ కవిత డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్​ సంక్షేమ పథకాలతో ప్రజలంతా తెరాస వెంట ఉన్నారని తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహబూబాబాద్​ మూడో స్థానంలో ఉందని... ఇందుకు కృషి చేసిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుతున్నట్టు పేర్కొన్నారు. కమలం నేతలు తెరాసపై విమర్శలు మాని... రాష్ట్రానికి రావాల్సిన వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెరిపించాలని... సమ్మక్క సారలమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేయాలని చెప్పారు.

ఇదీ చూడండి : తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

Intro:Tg_wgl_22_26_MP_PC_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) భాజపా నాయకులకు తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను, సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తింపు సాధించాలని ఎంపీ మాలోత్. కవిత డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..... సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గం 3 వ స్థానంలో ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సంక్షేమ పథకాలతో ప్రజలంతా తెరాస వెన్నంటే ఉన్నారని, సభ్యత్వాల నమోదుకు కృషి చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ , మరియు కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కేంద్రo లో ప్రజల దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పార్టీ నిధులతో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం చేస్తున్నామని, దసరా వరకు పూర్తి చేసుకొని దసరా నాడు గృహప్రవేశం చేస్తామన్నారు. భాజపా నేతలు తెరాస పై విమర్శలు చేయడం తగదని, కేంద్రంలో బాజాపా అధికారంలో ఉందని కావున రాష్ట్రానికి సంబంధించిన వీటిని సాధించాలని అంతే తప్ప తెరాసపై విమర్శలు చేయడం తగదని అన్నారు. అనంతరం మహబూబాబాద్,డోర్నకల్ నియోజకవర్గాల తెరాస ఇంచార్జ్, ఎమ్మెల్సీ బోడకుంట్ల. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..... తెరాస సమావేశంలో లెక్కలు సరిగా చూడకపోవడంతో మహబూబాబాద్ నియోజకవర్గానికి రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉందని మొదట తెలిపారని, అనంతరం మూడో స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బైట్
మాలోత్.కవిత.....ఎం. పి. మహబూబాబాద్.
బోడకుంట్ల.వెంకటేశ్వర్లు... ఎమ్మెల్సీ

Body:ముఖ్యమంత్రి కెసిఆర్ గారు సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలంతా తెరాస వెంటే ఉన్నారని అన్నారు

Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.