మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత జిల్లాలోని గార్ల మండలంలో పర్యటించారు. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి పాకాల చెక్‌డ్యాంను పరిశీలించారు. గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు పాకాల చెక్‌డ్యాం వద్ద పడుతున్న పాట్ల గురించి తెలుసుకున్నారు. మండలంలో రూ.5 కోట్లతో నిర్మించిన నూతన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని సందర్శించారు.
పాకాల చెక్ డ్యాం ఎత్తు పెంపుదలకు నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని ఎంపీ కవిత తెలిపారు. గార్ల మండలంలో జ్వరాలతో 25 మంది మృతిచెందడం బాధాకరమన్నారు. జిల్లా వైద్యాధికారి మండలంపై దృష్టి సారించి, వైద్య శిబిరాలు నిర్వహించి ప్రభుత్వ వైద్య సేవలు అందరికీ అందేలా చూడాలని ఆదేశించారు.
- ఇదీ చూడండి : 'మహా' తుపాను వలలో చిక్కుకున్న కేరళ