ETV Bharat / state

హరితహారంతో భవిష్యత్తు సంతోషమయం: ఎంపీ మాలోత్ కవిత - mahabubabad district news

భావితరాలు హాయిగా ఉండాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మహబూబ్​బాద్​ ఎంపీ మాలోత్​ కవిత అన్నారు. మహబూబాబాద్​ మరిపెడలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పుట్టినరోజు సమయాల్లో మెుక్కలను నాటడం అలవాటు చేసుకోవాలన్నారు.

mahabubabad mp maloth kavitha spoke on harithaharam programme
'పుట్టినరోజు సమయాల్లో మెుక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి'
author img

By

Published : Jun 25, 2020, 6:59 PM IST

కేంద్రంలో భాజపాది మాటల ప్రభుత్వమేనని.. చేతల ప్రభుత్వం కాదని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత ఆరోపించారు. మహబూబాబాద్​ జిల్లా మరిపెడలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశంలో దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆరేనని... భావితరాల ప్రజలు కూడా హాయిగా ఉండాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నాటిన మొక్కలను కూడా సంరక్షించే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం.. ఒక్క తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. పుట్టినరోజు సమయాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో చెరువులు కుంటలను నింపి సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందన్నారు. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీల వేతనాల్లో కోత పెట్టారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు సంబంధించి ఏడాదికి ఇచ్చే రూ.ఐదు కోట్ల నిధులతోపాటు రానున్న రెండు సంవత్సరాల నిధులకు కోత పెట్టారని ఆమె ఆరోపించారు. దేశంలో సరైన ఆసుపత్రులు లేవన్నారు. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు నిధుల కొరత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు 20లక్షల కోట్లు ఇస్తామని బూటకపు మాటలు మాట్లాడుతుందని ఎంపీ కవిత విమర్శించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ప్రజలకు ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ పాల్గొని.. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 90 లక్షలు, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో 1.10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు సాగాలని ఎమ్మెల్యే అన్నారు.

ఇవీ చూడండి: '30 కోట్ల మొక్కలు నాటడమే ఆరో విడత హరితహారం లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.