ETV Bharat / state

ఆడపిల్ల పుట్టిందని అత్తింట్లో ఆనందం.. ఏం చేశారంటే..! - మహబూబాబాద్ జిల్లా వార్తలు

ఆడపిల్ల పుట్టిందని అత్తింట్లో ఆనందపడే సంఘటనలు చాలా అరదుగా జరుగుతాయి. కానీ ఈ మధ్య మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఆడ శిశువు జన్మించిందని రెండు కుటుంబాలు వినూత్నంగా స్వాగతం పలికాయి. ధనలక్ష్మి ఇంటికి వచ్చిందని కుటుంబమంతా మురిసిపోయారు.

happy a girl is born
ఆడపిల్ల పుడితే ఆనందం
author img

By

Published : Dec 29, 2020, 12:21 PM IST

ఒకప్పుడు మహబూబాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలలో ఆడపిల్ల పుడితే ఎలా వదిలించుకోవాలని చూసేవారు. కానీ కాలం మారింది. నేడు ఇదే జిల్లాలో ఆడపిల్ల పుడితే అత్తింటివారు ఘనంగా సత్కరిస్తున్నారు. 4 రోజుల క్రితం కేసముద్రం మండల కేంద్రంలో గులాబీ, బంతి పూలను పేర్చి బెలూన్లతో అలంకరించి ఆడ శిశువుకు ఘన స్వాగతం పలికారు.

అది మరువకముందే దన్నసరి గ్రామంలో ఫోటో గ్రాఫర్​గా జీవనం సాగిస్తున్న పింగళి నాగరాజు, సుమలత దంపతులకు రెండో కాన్పులో కూతురు జన్మించింది. మిత్ర అని నామకరణం చేశారు. పాప జన్మించిన తరువాత నాగరాజుకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. దీంతో మిత్రకు నెల రోజులు నిండడంతో... నూతన దుస్తులు వేసి రూ. 27 వేల కరెన్సీ నోట్లను పరిచిన మంచంపై పడుకోబెట్టారు. ధనలక్ష్మి మా ఇంటికి వచ్చిందని మురిసిపోయారు.

ఇదీ చదవండి: ట్వింకిల్​ ట్వింకిల్​ 'బ్యూటిఫుల్​' స్టార్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.