మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాలను సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఏబీసీడీ బ్లాకులను పరిశీలించారు.
ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిందని కలెక్టర్ తెలిపారు. నిర్మాణం పూర్తి కాగానే ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ ఇక్కడకి తరలిస్తామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: 'వారం టైం ఇస్తున్నాం... లేదంటే క్రిమినల్ కేసులే'