మహబూబాబాద్ డిపో ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ నరేశ్ మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్‌డిపో వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్‌డిపోలోకి చొచ్చుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి లోపలికెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ వాతారణం ఏర్పడింది. అనంతరం మృతదేహంతో బస్‌డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని... లేనిపక్షంలో శవపరీక్ష చేయనివ్వబోమని కార్మికులు భీష్మించుకున్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య