ETV Bharat / state

ఆ గ్రామంలో శివుడి మహిమ.. దర్శనమిచ్చిన నాగన్న.. వీడియో వైరల్​..

తెల్లారితే శివరాత్రి పర్వదినం.. సాయంత్రం మూడున్నర.. కుక్కలు తెగ అరుస్తున్నాయి. ఎందుకలా అరుస్తున్నాయని చూస్తే.. ఒక్కసారిగా ఒళ్లు ఝల్లుమంది. ఎప్పుడూ చూడనంత పొడవుతో.. వెడల్పాటి పడగతో.. ఓ చెట్టుపై నిటారుగా ఉండి బుసలుకొడుతున్న నాగుపాము.. ఇంకేముంది.. ఆ ఊర్లో శివరాత్రి జాతర ముందే మొదలైంది. కొందరు భక్తితో శివనామస్మరణ చేస్తే.. ఇంకొందరు భయంతో శివశివా అనటం ప్రారంభించారు.

long cobra appeared in nallella village for two hours on tree

author img

By

Published : Mar 1, 2022, 5:33 PM IST

ఆ గ్రామంలో శివుడి మహిమ.. దర్శనమిచ్చిన నాగన్న.. వీడియో వైరల్​..

మహబూబాబాద్​ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ పరమేశ్వరుని మెడలో బుసలు కొడుతూ ఉండే నాగన్న.. నల్లెల్ల గ్రామస్థులకు దర్శనమిచ్చాడు. గ్రామంలోని ఓ చెట్టుపై పెద్ద నాగుపాము కనిపించింది. పడగ విప్పి సుమారు రెండు గంటల పాటు చెట్టుపైనే ఉంది. ఎంత మంది స్థానికులు వచ్చి చూసినా ఏమాత్రం జంకకుండా అందరికీ దర్శనమిచ్చింది.

కుక్కల అరుపులు విని..

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ ఇంటి ప్రక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో సోమవారం(ఫిబ్రవరి 28) రోజున కొంతమంది రైతులు మిరపకాయలను ఎండబెట్టారు. సాయంత్రం మూడున్నర సమయంలో కుక్కలు బాగా అరిచాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామ పంచాయతీ కారోబార్(వీఆర్​ఏ) కృష్ట.. కుక్కల అరుపులు విన్నాడు. ఎమైందా అని అటువైపు చూడగా.. చెట్టుపై పెద్ద నాగుపాము పడగ విప్పి ఉండటాన్ని గమనించాడు. ఆ దృశ్యాలను తన సెల్​ఫోన్​లో రికార్డు చేశారు. ఈ విషయం గ్రామస్థులందరికీ తెలియడంతో.. వారంతా అక్కడికి వచ్చి పామును చూశారు.

రెండు గంటలకు పైగా..

సుమారు రెండు గంటలకు పైగా అక్కడే ఉండటంతో నాగుపామును చూసేందుకు ఎగబడ్డారు. తెల్లారితే మహాశివరాత్రి కావడంతో.. నాగుపాము దర్శనమివ్వటం శివుని మహిమ అని కొందరు శైవ భక్తులు తెలిపారు. నాగుపాము అక్కడి నుంచి వెళ్లిపోయే దాకా.. ఎవరూ ఎలాంటి హాని కలిగించకుండా చూశారు. రెండు గంటల అనంతరం ఆ పాము నెమ్మదిగా చెట్టుపై నుంచి దిగి పొదళ్లోకి వెళ్లిపోయింది.

ఎవరికి హాని తలపెట్టకుండా..

ఇంత పెద్ద పామును తాము ఎప్పుడూ ఎక్కడా చూడలేదని.. ఒకింత భయభ్రాంతులకు గురయ్యామని కొందరు గ్రామస్థులు వాపోయారు. ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా.. పాము వెళ్లిపోవటంతో ఊపిరి పీల్చుకున్నామన్నామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.