మద్యానికి బానిసై... తమను ఇబ్బందులు పెడుతున్నాడన్న కారణంతో భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లిలో జరిగింది. బీనబోయిన అంజయ్య, పద్మ దంపతులు కాగా... వీరికి కుమార్తె ఉంది. అంజయ్య మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నెల 21న మద్యం తాగొచ్చిన అంజయ్య... కుమార్తెను అసభ్య పదజాలంతో తిట్టాడు. తీవ్ర కోపంతో ఊగిపోయిన పద్మ... అంజయ్యను కర్రతో విపరీతంగా కొట్టింది. ఈ ఘటనలో అంజయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజులైనా... చికిత్స అందించకపోవటం వల్ల అంజయ్య 23న ఇంట్లోనే మృతి చెందాడు.
విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అంజయ్యను హత్య చేసింది భార్య పద్మగా గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.