ETV Bharat / state

సింహ రాశి వారికి ప్లవ నామ సంవత్సరం ఎలా ఉందంటే...

author img

By

Published : Apr 13, 2021, 12:32 PM IST

ఉగాదితో తెలుగు సంవత్సరం మారుతుంది. తమ గ్రహబలం మారుతుందని తెలుగు ప్రజలు నమ్ముతారు. అందుకే కొత్త ఏడాది ఎలా ఉండబోతుందోనని పంచాగంపై ఆసక్తి కనబర్చుతారు. మరి ప్లవ నామ సంవత్సరం సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం.

horoscope leo 2021, plava year leo horoscope
సింహ రాశిఫలాలు 2021, ప్లవ సంవత్సరంలో సింహ రాశి ఫలాలు
  • ఆదాయం- 2
  • వ్యయం- 14
  • రాజపూజ్యం-2
  • అవమానం 2

విశేషమైన శుభాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. మనోభీష్ట సిద్ధి కలుగుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయంగా మార్చుకుంటే జీవితంలో పైకి వస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులుంటాయి. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. మీవల్ల కొందరికి మేలు చేకూరుతుంది.

సమష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించి పని చేయండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయండి. ధర్మదేవత మిమ్మల్ని సదా కాపాడుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. గురు, కేతు శ్లోకాలు చదువుకోవాలి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఇదీ చదవండి: మహిళలకు రోజూ కావాలి షడ్రుచులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.