ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో న్యాయశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయమూర్తి అనిల్ కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ న్యాయమూర్తి రాధిక జైశ్వాల్లు మొక్కలు నాటారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి, చెట్లను పెంచాలని అంటూ నినాదాలు చేశారు. అనంతరం గాంధీ పార్కులో మొక్కలు నాటారు. మొక్కలను పిల్లలుగా భావించాలని, అవి తల్లి లాగా కాపాడుతాయని జిల్లా న్యాయమూర్తి తెలిపారు. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : ఏడుగురు చిన్నారులను పొట్టన పెట్టుకున్న చెరువులు