స్థానికేతర ఏకగ్రీవ ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేయాలని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్న గూడెం గ్రామస్తులు ధర్నాకు దిగారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు నామ పత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 2న జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో మిగతా ఏడుగురు అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నారు. పెద్ద నాగారం గ్రామానికి చెందిన అభ్యర్థి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానికేతరులు అవసరం లేదని... గ్రామానికి చెందిన వారే ఎంపీటీసీగా ఉండాలని గ్రామస్థులు మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని గ్రామ రహదారులపై ముళ్లకంపలు వేసి ఆందోళన చేపట్టారు. స్థానికేతరులైన ఎంపీటీసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికారులు ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని రామన్నగూడెం గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ప్రస్తుత విధానాల్లో లోపాలున్నాయి... మార్పు అవసరం