ETV Bharat / state

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: రెడ్యానాయక్‌ - మరిపెడలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి

తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Government's mission is the welfare of all communities: Redyanayak
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: రెడ్యానాయక్‌
author img

By

Published : May 23, 2020, 5:20 PM IST

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 221 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూతనందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.

రూ.25,000 పంట రుణాలు మాఫీ

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక దృష్టి సారిస్తూనే.. పేద ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.25,000 పంట రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. రుణమాఫీకి రూ.1200 కోట్ల రూపాయలను కేటాయించినట్లు స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ వివిధ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: నిప్పుల కొలిమిలా ఓరుగల్లు.!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.