మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం తెల్లవారుజామున ఈదురు గాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కురవడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలుల బీభత్సానికి దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటుచేసుకుంది. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో పిడుగు పాటుతో గుండాల సోమయ్య అనే రైతుకు చెందిన రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. మరో నాలుగు పశువులు ప్రాణాలతో బయట పడ్డాయి.
ఇవీ చూడండి: కాపాడకుండా వీడియోలు తీస్తే ఎలా?