మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 6 లక్షల విలువ చేసే 61 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తోటపల్లికి చెందిన శ్రీనివాస్, మహబూబాబాద్‌కు చెందిన బానోత్ కుమార్ గత రెండు సంవత్సరాలుగా ఒరిస్సా చుట్టుపక్కల ప్రాంతాల్లో కిలో గంజాయిని మూడు వేలకు కొనుగోలు చేసి... హైదరాబాద్‌లో కిలో రూ. పది వేల చొప్పున విక్రయిస్తున్నారని డీఎస్పీ నరేష్కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్