భాజపా చేపట్టిన " సేవా సప్తహ్ " కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్‌ను ఆ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగానే ఈ కార్యక్రమం చేపట్టామని భాజపా జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య తెలిపారు. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ముక్కోటి దేవతలను వేడుకున్నామన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రాలపై కేంద్రం కర్రపెత్తనం చేస్తోంది: సీఎం కేసీఆర్