మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారం గ్రామంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువలు నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భూ సేకరణకై సర్వే చేస్తున్న రెవిన్యూ బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. 186 మంది రైతులకు చెందిన 260 ఎకరాల వ్యవసాయ భూమి గుండా కాలువ నిర్మించనున్నారు. ఇదివరకే.. రోడ్డు నిర్మాణం కోసం రైతులు భూములు వదులుకున్నారు.
ఇప్పుడు మళ్లీ కాలున నిర్మాణం కోసం అధికారులు భూ సర్వే చేస్తుండడం వల్ల రైతులు అడ్డుకున్నారు. అధికారుల సర్వేను నిరసిస్తూ గార్ల ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. ఇప్పటికే రోడ్డు వల్ల కొంత భూమి నష్టపోగా.. కాలువ నిర్మాణం వల్ల మరింత భూమి కోల్పోతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నిరసనకు సీపీఎం, సీపీఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు మద్దతు పలికాయి.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం