ETV Bharat / state

Fire Accidents In Telangana : రాష్ట్రవ్యాప్తంగా మూడు అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తి నష్టం - ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం

Today Fire Accidents In Telangana : రాష్ట్రంలో నేడు మూడు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో భారీగానే సుమారు రూ.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం.. శుభపరిణామంగా చెప్పవచ్చు. వేసవి ఎండలకు తోడు అజాగ్రత్త వల్లే ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.

Fire Accidents
Fire Accidents
author img

By

Published : Jun 10, 2023, 8:07 PM IST

Updated : Jun 10, 2023, 9:22 PM IST

Three Fire Accidents In Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగభగమండడంతో.. మూడు చోట్ల భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. దీంతో భారీగానే ఆస్తి నష్టం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మహాదేవ్‌ ఇండస్ట్రీలో ఉదయం పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ధాన్యం, బియ్యం, గన్ని బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యజమాని తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్‌, రెవెన్యూ, సివిల్‌ సఫ్లై శాఖల అధికారులు అక్కడకు చేరుకొని, విచారణ చేపట్టారు.

Fire Accident In Rice Mill At Mahbubabad : షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదంతో చెలరేగిన మంటలకు విపరీతమైన గాలులు తోడవడంతో క్షణాల్లోనే ఇండస్ట్రీస్‌లో మంటలు వ్యాపించాయి. ధాన్యం, బియ్యం, గన్ని సంచులు, రైస్‌ మిల్లు, ఆధునాతన విద్యుత్‌ మోటార్లు అగ్నికి ఆహుతయ్యాయి. మిల్లులో ఉన్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఘటనాస్థలానికి చేరుకొని 3 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. రైస్‌ మిల్‌ ముందు భారీగా ఉన్న ధాన్యం బస్తాలకు మంటలు రాకుండా అదుపు చేయగలిగారు. లేనిపక్షంలో ఇంకా భారీగానే ఆస్తి నష్టం యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినా.. ప్రాణ నష్టం జరగకపోవడంతో మిల్లులో ఉండే కార్మికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Solar Plant Fire Accident in Peddapalli : మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామ పరిసరాల్లో నిర్మించిన 10 మెగావాట్స్‌ల సోలార్‌ ప్లాంట్‌లో మంటలు చేలరేగాయి. ఆ పరిసర ప్రాంతంలోని రైతులు చెత్తను తగలబెట్టిన సమయంలో ఒక్కసారిగా గాలి రావడంతో అగ్నికీలలు పక్కనే ఉన్న సోలార్‌ ప్లాంట్‌లోని ఎండిపోయి ఉన్న గడ్డికి అంటుకోవడంతో భారీగానే మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న సిబ్బంది సోలార్‌ నుంచి వచ్చే కరెంట్‌ను నిలిపివేయడంతో భారీ నష్టాన్ని తప్పించుకున్నారు. ఫైర్‌ ఇంజన్‌తో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

Khammam Cotton Market Fire Accident : ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీగా పత్తి మంటలకు ఆహుతి అయ్యింది. సుమారు 1600 బస్తాల తెల్లబంగారం అగ్ని పాలై.. రూ.1.25 కోట్ల మేర భారీగా ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ అగ్ని ప్రమాదానికి భయబ్రాంతులై కార్మికులు, రైతులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి ఫోన్‌ చేయడంతో.. సకాలంలో స్పందించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.1.25 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 10, 2023, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.