మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు వ్యవధిలో కరోనా కాటుకు తండ్రీకొడుకు ఇద్దరూ చనిపోయారు. స్థానికంగా నివసించే వృద్ధుడు( 70) కొవిడ్‌తో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈ నెల 2న మృతి చెందారు. ఆయన మరణించిన రెండో రోజే కుమారుడు(50).. మహమ్మారికి గురై నగరంలోనే చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.
అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీఐ బ్రాంచ్ మేనేజర్ కరోనాతో చనిపోయారు. జిల్లాలో ప్రతినిత్యం వందల మంది కరోనా బారిన పడుతూ రోజూ పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. వరుస ఘటనలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: ఏ చట్టం కింద సర్వేకు వెళ్లి బోర్డు పెట్టారు?: హైకోర్టు