ETV Bharat / state

ధాన్యం అమ్మినా రైతులకు తప్పని తిప్పలు - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు

కష్టపడి పండంచిన పంటను అమ్ముకోవడానికి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం కొన్నా వాటిని తరలించేంత వరకు అన్నదాతలు నిరీక్షించాల్సి వస్తోంది.

ధాన్యం అమ్మినా రైతులకు తప్పని తిప్పలు
ధాన్యం అమ్మినా రైతులకు తప్పని తిప్పలు
author img

By

Published : Jun 12, 2021, 5:17 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఐకేపీ సెంటర్లలో ధాన్యం కోనుగోలు చేశారు. ధాన్యం తరలించడం ఆలస్యమవటంతో వాటిని గోదాములకు తరలించాలని ఐకేపీ నిర్వాహకులు రైతులకు సూచించారు. దీంతో అన్నదాతలు సొంత ఖర్చులతో గోదాముల వద్దకు ధాన్యం బస్తాలు తీసుకెళ్లారు. గోదాములు నిండిపోటంతో రెండు రోజులుగా అక్కడే ఉండి నిరీక్షిస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని పోసి 15 రోజులకు పైగా ఎదురు చూశామని రైతులు తెలిపారు. తీరా కొనుగోలు చేసి కాంటా అయిన తర్వాత సొంత ఖర్చులతో ట్రాక్టర్లలో బస్తాలను గోదాములకు తరలిస్తే గోదాములు ఖాళీలేవని చెబుతున్నారని వాపోయారు. రెండు రోజులుగా వేచి చూస్తున్నామని చెప్పారు. వాహనాల కిరాయి పెరిగి పోతుందని తెలిపారు.

కేసముద్రం ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా గోదాములకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. మార్కెట్లో ఉన్న గోదాములు నిండిపోయాయని, ప్రత్యామ్నాయ గోదాములను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.