మహబూబాబాద్ జిల్లాలో మక్కల కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మార్క్ఫెడ్ ఛైర్మన్ గంగారెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. కేసముద్రం మండలం వెంకటగిరి, మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామాల్లో కొనుగోలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలను రూ. 1760 మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు అధైర్య పడవద్దని.. టోకెన్ల వారీగా కొనుగోలు కేంద్రాలకు సరకులు తీసుకుని రావాలని ఎమ్మెల్యే సూచించారు.
మక్కలు బాగా ఎండబెట్టి తేమ లేకుండా చూసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం నీటితో రబీలో ధాన్యం మంచి దిగుబడి వస్తుందన్నారు. వాటిని కూడా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు