మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో... మహిళలు బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. తీరొక్క పూలతో ఎంగిలి బతుకమ్మలు చేసి... పండుగను ప్రారంభించారు. అధిక మాసం కారణంగా వచ్చేనెల 16 నుంచి బతుకమ్మ నిర్వహించుకోవాలని పండితులు సూచించినా... పితృ అమావాస్యను పురస్కరించుకుని గురవారమే ఎంగిలి పూల బతుకమ్మను చేసి ఆడిపాడారు. పలు చోట్ల బతుకమ్మలు పేర్చి కోలాటాలు చేశారు. అక్టోబర్ 17 నుంచి పండుగను కొనసాగించనున్నారు.
ఇదీ చూడండి: ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు... తీరొక్క పూలు పేర్చి ఆట పాటలు