పెళ్లి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం రోజున గ్రామానికి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో కుమార్తె వివాహం జరిగింది.
రిసెప్షన్ కోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంటి యజమానులు వచ్చి చూస్తేగాని నష్టం ఎంత వాటిల్లిందనేది తెలుస్తుంది.
ఇదీ చూడండి: మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా కుట్ర: ఇంద్రకరణ్ రెడ్డి